Yash Dayal: క్రికెటర్ యశ్ దయాళ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు అతడి అరెస్టుపై స్టే విధించింది. ఈ కేసులో తాత్కాలికంగా ఉపశమనం లభించడంతో, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు పోలీసులు అతడిని అరెస్టు చేయకుండా ఉంటారు.
యశ్ దయాళ్‌పై ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో జూలై 6న ఒక మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. యశ్ దయాళ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు, జస్టిస్ సిద్ధార్థ్ వర్మ మరియు అనిల్ కుమార్ ధర్మాసనం అరెస్టుపై స్టే ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 73 ఏళ్ల రికార్డు బద్దలు
ఐదేళ్లపాటు మోసం జరిగిందని ఫిర్యాదులో పేర్కొనడంపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. “ఎవరైనా ఒకరోజు మోసపోతారు, రెండ్రోజులు మోసపోతారు, కానీ ఐదేళ్లపాటు ప్రతిరోజూ మోసపోతూనే ఉంటారా?” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు ఐదేళ్ల కాలంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్ని కోర్టు పరోక్షంగా ప్రస్తావించింది.
కోర్టు తదుపరి విచారణ వరకు అతడిని అరెస్టు చేయకుండా ఆదేశించింది. బాధితురాలికి మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, ఈ కేసుపై వివరణ ఇవ్వాలని కోరింది. కేసు తదుపరి విచారణ నాలుగు నుండి ఆరు వారాల్లో జరగనుంది. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలు యశ్ దయాళ్‌కు తాత్కాలికంగా ఊరటనిచ్చాయి. ఈ కేసు విచారణ , తుది తీర్పు అతని కెరీర్‌పై ప్రభావం చూపవచ్చు

