Allahabad High Court: 2022లో జరిగిన భారత్ జోడో యాత్రలో భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు చురకలు అంటించింది. అలాంటి వ్యాఖ్యలు వాక్స్వాతంత్య్రం హక్కు కిందకు రావని, భారత సైన్యానికి అవమానంగా ఉండే ప్రకటనలు ఎవరు చేసినా అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీపై లక్నోలో ఓ స్థానిక కోర్టు సమన్లు జారీ చేయగా, వాటిని రద్దు చేయాలంటూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
కోర్టు చెప్పినది ఏమిటంటే – “భావ స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు కాబట్టి ఎవరికైనా ఉంది. కానీ దేశ భద్రతకు సంబంధించిన సైన్యం వంటి సంస్థలపై అవాకులు, జవాకులు మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.”
Also Read: Harish Rao: కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదు
Allahabad High Court: భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ మాట్లాడుతూ – చైనా 2000 కి.మీ భారత భూభాగాన్ని ఆక్రమించిందని, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యంపై దాడులు చేసి 20 మందిని చంపిందని వ్యాఖ్యానించారు. దీనిపై BRO (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్)కు చెందిన రిటైర్డ్ అధికారి ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో లక్నో కోర్టు రాహుల్‌కి సమన్లు జారీ చేసింది.
అయితే, ఆ సమన్లను రద్దు చేయాలని రాహుల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు మళ్ళీ తిరస్కరించడమే కాదు, ఇకపై ఇలాంటివి చేయవద్దంటూ గట్టి హెచ్చరిక కూడా చేసింది.