Alla Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరఫున పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, ఇంతలోనే తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అకాల మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.
