Yadbhavam Tadbhavati: ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా "యద్భావం తద్భవతి" చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Yadbhavam Tadbhavati: ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Yadbhavam Tadbhavati: రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “యద్భావం తద్భవతి”. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించగా ఈ చిత్ర పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర బృందం విడుదల చేస్తుంది. విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ ను ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఇప్పుడే యద్భావం తద్భవతి చిత్ర టీజర్ చూసాను. ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి గారు నిర్మించిన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఒక పాట కూడా చూడటం జరిగింది. రమేష్ జక్కల గారి దర్శకత్వం, మిహిరామ్ గారి సంగీతం చాలా బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కళ పట్ల ఉన్న అభిమానంతో సినిమా తీయడం చాలా పెద్ద విషయం. ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్ అలాగే ఇతర నటీనటులకు చిత్ర బృందానికి నా అభినందనలు. లోహిత్, శ్రీకాంత్ అయ్యంగర్ వంటి ఎంతో సీనియర్ నటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి నిర్మాత మరో సినిమా తీసేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటీనటులు :
వరుణ్ సందేశ్, ఇనయ సుల్తానా, రేణు శ్రీ, సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్ : ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం : రమేష్ జక్కల
నిర్మాత : ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి
సినిమాటోగ్రఫీ : శ్యామ్
సంగీతం : మిహిరామ్
మ్యూజిక్ పార్ట్నర్ : కే మ్యూజిక్ తెలుగు
పిఆర్ఓ : మధు విఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *