Donald Trump: అమెరికన్ సమాజపు జీవన విధానాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ‘వినియోగతత్వం’ (Consumerism). సూపర్ మార్కెట్లలో కొండలా పేర్చిన షాపింగ్ కార్ట్లు, హైవేల వెంట భారీ బర్గర్లు, కార్ల ప్రయాణాలు ఆ దేశ సంస్కృతిలో భాగం. అమెరికా స్థూల ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతానికి పైగా వ్యక్తిగత వినియోగంపైనే ఆధారపడి ఉంటుంది.
అలాంటి జీవన ప్రమాణాలకు పెరిగిన జీవన వ్యయం (Cost of Living) గండికొడితే అమెరికన్లు అస్సలు సహించరు. సరిగ్గా ఇదే అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మధ్యంతర ఎన్నికల్లో నిలువునా ముంచేసింది. ఇరాన్‌తో మొదలుపెట్టిన యుద్ధం, దానివల్ల భగ్గుమన్న చమురు ధరలు.. ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి.
ఇరాన్ యుద్ధం తెచ్చిన చమురు సంక్షోభం..
-
యుద్ధం & హోర్ముజ్ సంక్షోభం: ఇరాన్‌పై దాడులు చేసి అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టిన తర్వాత, పశ్చిమాసియా రణరంగంగా మారింది. వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’ని ఇరాన్ స్తంభింపజేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అస్తవ్యస్తమైంది.
-
భగ్గుమన్న ధరలు: యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 105 డాలర్లకు ఎగబాకింది (ఏప్రిల్‌లో 125 డాలర్లను తాకింది).
-
అమెరికాలో ద్రవ్యోల్బణం: యూఎస్ గ్యాస్ స్టేషన్లలో పెట్రోల్ ధరలు 40 శాతం పెరగ్గా, డీజిల్ ధరలు 60-70 శాతం పెరిగాయి. 90 శాతం నిత్యావసర సరుకుల రవాణా డీజిల్ ట్రక్కులపైనే ఆధారపడే అమెరికాలో ద్రవ్యోల్బణం (CPI) 2.4 శాతం నుంచి 3.8 శాతానికి చేరి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది.
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల కోటలు బద్దలు..
-
కాంగ్రెస్ డెమొక్రాట్ల వశం: మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘనవిజయం సాధించి యుఎస్ కాంగ్రెస్‌పై పూర్తి నియంత్రణను సాధించారు.
-
టెక్సాస్‌లో చారిత్రక మార్పు: రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో డెమొక్రాట్లు సెనేట్‌తో పాటు గవర్నర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. నెటిజన్లు అన్నట్లు.. ఇరాన్లో ప్రభుత్వం మారడం అటుంచితే, టెక్సాస్‌లో మాత్రం మార్పు వచ్చింది.
-
కాన్సాస్, ఒహియో, అయోవా: 1932 తర్వాత తొలిసారిగా కాన్సాస్‌లో డెమొక్రాట్ సెనేటర్ విజయం సాధించగా, 2024లో ట్రంప్ సునాయాసంగా గెలిచిన ఒహియో, అయోవా రాష్ట్రాలు సైతం డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపాయి.
ఇరాన్ యుద్ధమే మా కొంపముంచింది.. ట్రంప్ స్వయంగా అంగీకారం
