TGSC Group 1 Mains

TGSC Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై ఉత్కంఠ‌.. నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వం సిద్ధం

TGSC Group 1 Mains: తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్కారు స‌ర్వం సిద్ధం చేసింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి జ‌రిగే ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. మ‌రోవైపు అభ్య‌ర్థులతో పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. సోమ‌వారం ఉద‌య‌మే అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ సందిగ్ధ ప‌రిస్థితుల్లో అయోమ‌యం నెల‌కొన్న‌ది.

TGSC Group 1 Mains: గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల కోసం 31,382 మంది అభ్య‌ర్థులు రాయ‌నున్నారు. సోమ‌వారం ఉద‌యం మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి 5:00 గంట‌ల వ‌ర‌కు 46 ప‌రీక్ష కేంద్రాల్లో క్వాలిఫైయింగ్ ప‌రీక్ష‌తో షురూ కానున్న‌ది. ఈ నెల 27 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్ష కేంద్రాల‌న్నీ హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే ఉంటాయి. ఒక్కో కేంద్రంలో ఒక ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయి పోలీస్ అధికారితోపాటు పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌నున్నారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్ అమ‌లులో ఉన్న‌ది.

ఇదే స‌మ‌యంలో జీవో 29ని ర‌ద్దు చేయాల‌ని, గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను రీషెడ్యూల్ చేయాల‌ని ప‌లువ‌రు అభ్య‌ర్థులు గ‌త ఐదు రోజులుగా ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. వారి ఆందోళ‌న‌ను పోలీసులు నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. ప్ర‌భుత్వం కూడా గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని తేల్చి చెప్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అభ్య‌ర్థుల్లో గుబులు నెల‌కొన్న‌ది.

TGSC Group 1 Mains: ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వం పున‌రాలోచించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ మేర‌కు కేంద్ర మంత్రులైన కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రిని కోరారు. ఏకంగా బండ సంజ‌య్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అభ్య‌ర్థుల మ‌నోగ‌తాన్ని అర్థం చేసుకోవాల‌ని, వారి కోరిక మేర‌కు వాయిదా వేయాల‌ని కోరారు. అభ్య‌ర్థుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని మంత్రులు కోరారు.

TGSC Group 1 Mains: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల్సిందేన‌ని బీఆరెస్ పార్టీ మొద‌టి నుంచి ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తున్న‌ది. గ్రూప్స్ అభ్య‌ర్థుల పోరాటాల్లో ఆ పార్టీ నేత‌లు పాల్గొంటూ వ‌స్తున్నారు. ఏకంగా బీఆరెస్ త‌ర‌ఫున కూడా గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయించేందుకు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జీవో 29ని ర‌ద్దు చేయాల‌ని, కోర్టు తీర్ప‌లు వ‌చ్చేదాకా గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆ పార‌ట్ఈ నేత‌లు కోరుతున్నారు.

ఈ ద‌శ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా? ప్ర‌భుత్వం ఏమైనా పున‌రాలోచిస్తుందా? సోమ‌వారం ఉద‌యం కోర్టు తీర్పు అభ్య‌ర్థుల‌కు అనుకూలంగా వ‌స్తుందా? వ్య‌తిరేకంగా వ‌స్తున్న‌దా? అభ్య‌ర్థుల పోరాటం ఏ రూపు దాల్చ‌నున్న‌ది? అన్న విష‌యాల్లో ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ఏది ఏమైనా సామ‌ర‌స్య వాతావ‌ర‌ణం నెల‌కొనాల‌ని కోరుకుందాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *