Akhil Akkineni: అక్కినేని అఖిల్ సినిమాఎట్టకేలకు మొదలైంది. ‘ఏజెంట్’ మూవీ తర్వాత కాస్తంత విరామం తీసుకున్న అఖిల్ కథలు వింటూనే కాలం గడిపేశారు. త్వరలో పెళ్ళి పీటలు కూడా ఎక్కబోతున్న అఖిల్… ఇప్పుడు తిరిగి యాక్టింగ్ మోడ్ లోకి వచ్చేశారు. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ‘లెనిన్’ అనే సినిమాను ప్రారంభించింది. మురళీ కిషోర్ అబ్బూరు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశాడు. దర్శకుడు చేపిన కథ నచ్చడంతో అఖిల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే… శ్రీలీల అక్కినేని నాగచైతన్య తోనూ ఓ సినిమా చేయబోతోంది. దీనికి కార్తీక్ దండు దర్శకుడు. విశేషం ఏమంటే ఈ అన్నదమ్ములు ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లలో శ్రీలీల మూడో వ్యక్తి. గతంలో పూజా హెగ్డే, నిధి అగర్వాల్ ఇద్దరూ అటు చైతు తోనూ, ఇటు అఖిల్ తోనూ కలిసి నటించారు.
