Akhanda 2: నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న పైడ్ ప్రీమియర్స్ ఉంటాయి. ఈ ప్రీమియర్స్ టికెట్ రేట్లపై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అంతకుముందు రోజు అంటే డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం పైడ్ ప్రీమియర్స్ ఉంటాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Also Read: Spirit: స్పిరిట్‌లో రణబీర్ క్యామియోపై క్లారిటీ?
ఈ ప్రీమియర్స్ టికెట్ ధరలపై అనేక అంచనాలు వచ్చాయి. కానీ తాజాగా మేకర్స్ స్పందిస్తూ టికెట్ రేట్లు అందరికీ అందుబాటులోనే ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో భారీ హైక్ ఉంటుండగా, ఈసారి మీడియం రేంజ్‌లోనే ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంయుక్త మేనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం అభిమానులకు పండుగ కానుకగా రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఐ ఫీస్ట్ ని ఇస్తుందో చూడాలి.

