Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భారీ అవైటెడ్ చిత్రం అఖండ 2 తాండవం గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియా ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. శరవేగంగా సాగుతున్న షూటింగ్‌తో ఈ సినిమా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో నేడు బోయపాటి శ్రీను పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పవర్‌ఫుల్ స్పెషల్ విషెస్ తెలిపారు.అయితే, ఈ విషెస్‌తో పాటు అఖండ 2 రిలీజ్‌పై వస్తున్న రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిందన్న వార్తలు వినిపించినా, అవన్నీ ఫేక్ అని తేలిపోయింది.
Also Read: Srinidhi Shetty: ‘రామాయణం’లో సీత పాత్రని పోగొట్టుకున్న KGF బ్యూటీ!
Akhanda 2: అఖండ 2 తాండవం ఖచ్చితంగా సెప్టెంబర్ 25న దసరా కానుకగా థియేటర్స్‌లో విడుదలవుతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. బోయపాటి బ్రాండ్ యాక్షన్, బాలయ్య ఎనర్జీతో అఖండ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


