Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’ షూట్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు మరో నెల రోజులు టైమ్ మాత్రమే ఉంది. నవంబర్ లో బ్యాలెన్స్ వర్క్ తో పాటు ఐటమ్ సాంగ్ ను కూడా పూర్తి చేయనున్నారు. శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి షార్ట్ గ్యాప్ తీసుకుని ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు బన్నీ. శీతల పానీయం థమ్స్ అప్ యాడ్ చిత్రీకరణలో పాల్గొనటానికే ఈ గ్యాప్ అట. ఈ యాడ్ ను ‘సరిపోదా శనివారం’ దర్శకుడు వివేక్ ఆత్రేయ పర్యవేక్షిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Nani-Sujeeth: చేతులు మారిన నాని, సుజిత్ చిత్రం..?
Allu Arjun: పుష్ప2 రిలీజ్ టైమ్ కి ఈ యాడ్ కూడా అన్ని మాధ్యమాలలో ప్రసారం చేస్తారట. నిజానికి ఈ యాడ్ లో గతంలో చిరంజీవి, విజయ్ దేవరకొండ, మహేశ్ బాబు వంటి స్టార్స్ నటించారు. ప్రస్తుతం బన్నీకి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తనపై షూట్ చేసి పుష్ప2 రిలీజ్ టైమ్ కి మార్కెట్ లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటోంది థమ్స్ అప్ సంస్థ. ఇక ఇప్పటికే కోకోకోలా, 7 అప్, ఫ్రూటీ వంటి శీతల పానీయాల ప్రకటనలలోనే కాకుండా జొమాటో, రాపిడో, కెఎఫ్సి, మెక్ డోనాల్డ్, ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్, లాట్ మొబైల్స్, హీరో మోటర్ బైక్ వంటి పలు బ్రాండ్స్ లో నటించిన బ్రాండ్ అంబాసిడర్ గా ‘రేసుగుర్రం’లా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. మరి మహేశ్ ని తప్పించి బన్నీతో ప్రచారాన్ని నిర్వహిస్తున్న ‘థమ్స్ అప్’కి సేల్స్ ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి.