Golmaal 5: దీపావళికి ‘సింగం ఎగైన్’తో వచ్చిన అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి ఇప్పుడు మరో ఫ్రాంఛైజ్ పై కన్నేశారు. ‘సింగం’ ఫ్రాంఛైజ్ లో భాగంగా వచ్చిన ‘సింగం ఎగైన్’ లో పలువురు స్టార్స్ నటించినా ఎందుకో అనుకున్న స్థాయిలో అలరించలేకపోతోంది. ఇక దాని నుంచి బయటకు వచ్చిన రోహిత్, అజయ్ దేవగన్ ద్వయం ‘గోల్ మాల్’ ఫ్రాంఛైజ్ పై దృష్టి సారించారు. ఇప్పటి వరకూ ఈ ఫ్రాంఛైజ్ లో నాలుగు భాగాలు వచ్చియి. అన్నీ కమర్షియల్ గా విజయం సాధించాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా సాగే ఈ ఫ్రాంఛైజ్ కి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘గోల్ మాల్ 5’కి రంగం సిద్ధం చేశారు. ఈ ఎంటర్ టైనర్ తర్వాత మరో యాక్షన్ సినిమా చేయాలని భావిస్తున్నాడు రోహిత్ శెట్టి. అజయ్ దేవగన్ ప్రస్తుతం ‘రైడ్2’, ‘సన్ ఆఫ్ సర్దార్ 2’తో బిజీగా ఉన్నాడు. ఆ కమిట్ మెంట్స్ పూర్తి కాగానే రోహిత్ శెట్టితో ‘గోల్ మాల్ 5’ సెట్స్ మీదకు వెళ్ళనున్నాడు. ‘సింగం’ ఫ్రాంచైజ్ తాజా చిత్రంతో నిరాశపరిచిన అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి ‘గోల్ మాల్’ ఫ్రాంచైజ్ 5తో అయినా హిట్ కొడతారేమో చూడాలి.