Adar Poonawalla: ఇటీవలే కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ కు చెందిన సగం షేర్స్ ను వెయ్యి కోట్లకు సీరమ్ వాక్సిన్ కంపెనీ సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాను నిర్మించిన భారీ చిత్రాలు పరాజయం కావడంతో కరణ్ జోహార్… వాటిని సీరమ్ సంస్థకు విక్రయించినట్టు బిజినెస్ వర్గాలు తెలిపాయి. నార్త్ లోనే కాకుండా సౌత్ లోనూ ఈ తరహా డీల్ కు సీరమ్ సంస్థ తహతహలాడుతోందని తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ కలిసి ఇప్పుడు చిత్ర నిర్మాణం, పంపిణీ రంగాలలో ఉన్నాయి. వీటికి సంబంధించిన వాటాను కూడా భారీ మొత్తంలో సొంతం చేసుకోవాలని సీరమ్ సంస్థ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. నిజానికి కరణ్ జోహార్ మాదిరిగా ఈ రెండు సంస్థలు ఎలాంటి నష్టాల్లోనూ లేవు. అయినా వీరి మార్కెట్ స్ట్రేటజీ నచ్చి వీరితో కలిసి ముందుకు సాగాలని సీరమ్ అధినేత అదార్ పూనావాలా యోచన చేస్తున్నారని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలు పరభాషా చిత్రాల పంపిణీతో బిజీగా ఉన్నాయి. కన్నడ చిత్రం ‘బఘీర’ను దీపావళి కానుకగా వీరు రిలీజ్ చేయబోతున్నారు.
