Sreeleela: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అంతవరకూ ఆమె పోషించిన పాత్రలకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేసి విమర్శకులనూ మెప్పించింది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే అది వెండితెర మీద కాదు బుల్లితెర మీద. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో శ్రీలీల పాల్గొంది. ఆమెతో పాటు ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి సైతం హాజరయ్యాడు. వీరిద్దరితో బాలకృష్ణ ఎలాంటి చలోక్తులు విసిరారో తెలుసుకోవాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చూడాలి.