Mumbai: భారతీయ రైల్వే క్రమంగా రైళ్లను సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తేలా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉంది. అంతేకాకుండా రైల్వే మరో ముందడుగు వేసింది. పశ్చిమ రైల్వే నవంబర్ 27 నుండి ముంబై సబర్బన్ విభాగంలో 13 AC లోకల్ రైలు సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో మొత్తం ఏసీ సర్వీసుల సంఖ్య 96 నుంచి 109కి పెరగనుంది.
AC లోకల్ రైళ్లకు ప్రయాణికులలో ఆదరణ పెరుగుతోంది. పెరుగుతున్న ఈ డిమాండ్ దృష్ట్యా, పశ్చిమ రైల్వే ముంబై సబర్బన్ సెక్షన్‌లో నవంబర్ 27 బుధవారం నుండి AC లోకల్ రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. 13 కొత్త ఏసీ సర్వీసులను ప్రవేశపెట్టిన తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏసీ రైళ్ల సంఖ్య 96 నుంచి 109కి పెరగనుండగా, శని-ఆదివారాల్లో 52 నుంచి 65కు పెరగనుంది.
Mumbai: పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం, ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందువల్ల, ప్రయాణీకుల ప్రయోజనాల కోసం, రద్దీకి అనుగుణంగా, పశ్చిమ రైల్వేలో మరో 13 ఎసి రైళ్లను ప్రవేశపెడుతున్నారు.
ఈ రైలు సర్వీసులు వారంలో అన్ని రోజులు ఏసీ సర్వీసులుగా నడుస్తాయి. ఈ ఏసీ రైళ్లను నడపడం వల్ల మొత్తం రైల్వే సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు, అదనంగా 109 ఏసీ లోకల్ ట్రైన్ సర్వీసులతో పాటు లోకల్ సర్వీసుల సంఖ్య 1406గా ఉండనుంది.