Actress Fiance Sucide: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్లో నటిస్తున్న సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోహాని కుమారి రాజస్థాన్‌కు చెందిన నటి. ఆమె బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాల్లో కనిపిస్తుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సవాయ్ సింగ్‌తో పరిచయం అయ్యారు. సవాయ్ కూడా రాజస్థాన్ వాసి. ఈ పరిచయం స్నేహంగా మారింది, తర్వాత ప్రేమగా మారింది. గత జూలైలో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాంత్ నగర్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. సోహాని ఇక్కడే సినిమా పనులు చేస్తూ ఉంటుంది.
శనివారం ఉదయం సవాయ్ సింగ్ సోహాని ఫ్లాట్‌కు వచ్చాడు. తర్వాత ఇద్దరూ గచ్చిబౌలిలోని ఎవరి కార్యాలయాలకు వాళ్ళు వెళ్లారు. సాయంత్రం సోహాని ఇంటికి తిరిగి వచ్చి తలుపు తెరిచి చూసింది. డైనింగ్ హాల్లో సవాయ్ ఉరి వేసుకుని ఉండటం చూసి షాక్ అయినా సోహాని వెంటనే పోలీసులకు కాల్ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులు స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
ఆత్మహత్య చేసుకునే ముందు సవాయ్ సింగ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో నేను జీవితంలో చాలా తప్పులు చేశాను. ఇక మళ్లీ అలాంటివి చేయను అంటూ చెప్పాడు. ఈ వీడియోను పోలీసులు కోర్స్ టీమ్ సహాయంతో సేకరించారు. సోహాని ఫిర్యాదులో, సవాయ్ మునుపు మరో యువతితో స్నేహం ఉండేదని, ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని చెప్పింది. ఈ కారణాల వల్లే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని అనుమానిస్తున్నారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు చూశారు. శుక్రవారం ఉదయం 11:47 గంటలకు సవాయ్ సింగ్ ఫ్లాట్ వెనుక డోర్ ద్వారా లోపలికి వెళ్లాడని తేలింది. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు రిజిస్టర్ చేసుకుని, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సవాయ్ మాజీ స్నేహితురాలిని విచారిస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.