Kasturi: తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ, బుల్లితెర నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఆమె అదృశ్యమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలంగాణ సంఘాలు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు ఇచ్చేందుకు ఆమె సెల్‌కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తున్నది. దీంతో ఏకంగా ఆమె ఇంటికే పోలీసులు వెళ్లారు. అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉన్నది.
Kasturi: పూర్వం తమిళప్రాంతాల్లోని రాజుల అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇక్కడే స్థిరపడ్డారంటూ నటి కస్తూరి చేసిన అనుచిత వ్యాఖ్యలతో అక్కడి తెలుగు వారు భగ్గుమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
Kasturi: ఈ దశలో తన తప్పును తెలుసుకున్న కస్తూరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కోరింది. అయినా ఈలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. ఆమెకు ఎలాగైనా శిక్ష పడాల్సిందేనని తెలుగు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతున్నది.