Dhanya Balakrishna: నటి ధన్య బాలకృష్ణ తన కెరీర్‌లో పెద్ద సక్సెస్ రాకపోవడానికి తానే కారణమని చెప్పింది. గ్లామర్, బోల్డ్ సీన్లు చేయకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయానని వెల్లడించింది. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది’, ‘నేను శైలజా’, ‘భలే మంచి రోజు’, ‘సాఫ్ట్వెర్ సుధీర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధన్య బాలకృష్ణ ‘కృష్ణ లీల’ ప్రమోషన్స్‌లో షాకింగ్ కామెంట్స్ చేసింది. గ్లామర్ రోల్స్ చేయకపోవడం వల్ల మంచి అవకాశాలు చేజారాయని అంగీకరించింది. మొదట నిరాశ చెందేదాన్నని, తర్వాత తన నిర్ణయాలే తన మార్గం నిర్ణయించాయని చెప్పింది. అలాగే ఫ్యామిలీ నేపథ్యం కూడా తన పరిస్థితికి కారణమని బాధపడింది. గ్లామర్‌కే ప్రాధాన్యత ఇచ్చే మేకర్స్ ఉన్నంతవరకు టాలెంటెడ్ హీరోయిన్లకు ఛాన్సులు రావడం చాలా కష్టమని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.

