Soubin Shahir: ఇటీవల షూటింగ్ లొకేషన్ లో డ్రగ్స్ వాడకం అనేది మలయాళీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.. ఇక సౌబిన్ షాహిర్ విషయానికొస్తే.. ఓటీటల ద్వారా ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంజుమ్మల్ బాయ్స్ తనకు పాన్-ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ `కూలీ`లోనూ యాక్ట్ చేస్తున్నాడు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా నిర్మాణానికి సంబంధించిన మనీలాండరింగ్ ఫిర్యాదులో సౌబిన్ షాహిర్ సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. మంజుమల్ బాయ్స్ సినిమా లాభాల్లో 40 శాతం ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, కానీ కేవలం రూ. 7 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్ ఎర్నాకుళం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ సహా మొత్తం 3 మందిని అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ జరిగిన వెంటనే ముగ్గురు ముందస్తు బెయిల్ కోరుతూ ఎర్నాకుళం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అరెస్ట్ అయిన ముగ్గురికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

