Prakash Raj: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు హాజరయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన సీఐడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరుకాగా, అధికారులు ఆయన్ను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతున్న ప్రముఖుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు.
నిజానికి, ఈ బెట్టింగ్ యాప్‌లకు సినీ తారలు, ఇతర ప్రముఖులు ప్రచారం చేయడంతో చాలామంది యువకులు వాటికి బానిసలయ్యారు. కొందరైతే అప్పులపాలై తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. దీనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, వాటిని దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సీఐడీ అదనపు డీజీపీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
ఈ బెట్టింగ్ యాప్‌ల కేసులో కేవలం ప్రకాశ్ రాజ్ గారే కాకుండా, నిన్న (మంగళవారం) నటుడు విజయ్ దేవరకొండని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో నటులు రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి వంటి సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.

