Actor Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి పర్వదినానికి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఫస్ట్ ఆఫ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. తాజాగా ఓ సాంగ్ రిలీజ్ డేట్‌ను కూడా నిర్మాతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ స్టైలిష్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Actor Prabhas: రెబల్ సాబ్ అనే సాంగ్‌ను నవంబర్ 23న విడుదల చేస్తున్నట్టు ది రాజాసాబ్ సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు థమన్ సంగీతం అందించగా, ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంటుందని సినిమా నిర్మాణ బృందం ప్రకటించింది. అదే విధంగా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ జనవరి 9న విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

