Jagapati Babu

Jagapati Babu: సాహితి ఇన్‌ఫ్రా కేసులో ఈడీ విచారణకు హాజరైన జగపతిబాబు

Jagapati Babu: ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సాహితీ ఇన్‌ఫ్రా అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఈ సంస్థ ప్రకటనల్లో జగపతిబాబు నటించిన నేపథ్యంలో ఈ విచారణ జరిగింది.

సాహితీ ఇన్‌ఫ్రా కేసు: రూ.800 కోట్ల మోసం
సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ ‘ఫ్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో సుమారు 700 మంది కస్టమర్ల నుంచి రూ.800 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిందని ఈడీ దర్యాప్తులో తేలింది. వసూలు చేసిన ఈ మొత్తాన్ని సంస్థ షెల్ కంపెనీల ద్వారా తరలించి, రూ.126 కోట్లతో 21 ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే రూ.161 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Also Read: Balakrishna: బాలయ్య వర్సెస్ కామినేని.. అసెంబ్లీలో మాటల యుద్ధం

జగపతిబాబును ప్రశ్నించిన అంశాలు
సాహిత్య ఇన్‌ఫ్రా ప్రకటనల్లో నటించినందుకు జగపతిబాబుకు ఎంత మొత్తం చెల్లించారు?
ఆ డబ్బును ఏవిధంగా ఉపయోగించారు?
సంస్థతో ఆయనకు ఏమైనా ఇతర ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా?

జగపతిబాబు బ్యాంక్ అకౌంట్‌కు సాహిత్య కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీల గురించి తెలుసుకోవడానికే ఆయనను విచారణకు పిలిచినట్లు తెలిపారు. ఈ స్కామ్‌లో ప్రచారం చేసిన ఇతర నటీనటులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో తదుపరి పరిణామాలపై జగపతిబాబు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *