Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ నుండి భరణి అవుట్..పోతు పోతు లక్షల రెమ్యూనరేషన్ తీసుకొని వేలాడు

Bigg Boss Telugu 9: ఊహించని పరిణామం! బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బలమైన కంటెస్టెంట్‌గా, ఫినాలే వరకు ఉంటాడని అంచనా వేసిన నటుడు భరణి శంకర్, ఆరో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆదివారం (అక్టోబర్ 19) దీపావళి సందర్భంగా జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ ఎలిమినేషన్‌ను ప్రకటించడంతో బిగ్ బాస్ అభిమానులు షాకయ్యారు.

భరణి ఎలిమినేషన్‌కు కారణం

ఆరో వారం నామినేషన్లలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా, చివరికి భరణి మరియు రాము రాథోడ్ మాత్రమే మిగిలారు. ఈ సమయంలో ఎలిమినేషన్‌ను మార్చేసే పవర్ అస్త్ర ఇమ్మాన్యుయేల్ వద్ద ఉంది. చాలా మంది ఇమ్మాన్యుయేల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భరణిని సేవ్ చేస్తాడని భావించారు.

ఇది కూడా చదవండి: Rishab Shetty: పేరు మార్చడు.. రూ. 700 కోట్ల సినిమా తీశాడు

అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఇమ్మాన్యుయేల్ అనూహ్యంగా రామూ రాథోడ్‌ను సేవ్ చేయడంతో, తక్కువ ఓట్లు పడిన భరణి శంకర్‌కు హౌస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఎలిమినేట్ అయినందుకు ఏమాత్రం బాధపడకుండా, మిగతా కంటెస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి, హుందాగా ఆయన హౌస్ నుంచి నిష్క్రమించడం విశేషం.

6 వారాలకు భరణి సంపాదన ఎంత?

భరణి శంకర్ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో అత్యంత ఆసక్తికరంగా మారిన చర్చ ఏంటంటే, బిగ్ బాస్ ద్వారా ఆయన ఎంత పారితోషికం అందుకున్నారు అనేదే. పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో సహాయక నటుడిగా, విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న భరణి గత కొన్నేళ్లుగా తెరపై పెద్దగా కనిపించడం లేదు.

బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరణి, ఈ సీజన్‌లో అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్లలో ఒకరుగా ఉన్నట్లు సమాచారం.

  • వారానికి పారితోషికం: భరణి శంకర్ ఒక వారానికి రూ. 3.5 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
  • మొత్తం సంపాదన: ఆరు వారాల పాటు హౌస్‌లో కొనసాగినందుకు గాను, ఆయన మొత్తం రూ. 21 లక్షలకు పైగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతనికి బయట మంచి క్రేజ్ ఇంకా అభిమానులు పెరిగారు.. డింతోనైనా  భరణికి సినిమా రంగంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *