Madanapalle: ప్రేమికుల రోజు, ప్రేమిస్తున్నా అని ప్రేమించిన అమ్మాయికి చెప్పే ఒక స్వీట్ డే. కానీ ఆ పనికిమాలిన వాడు ప్రేమించాను అని చెప్పాల్సింది పోయి …ప్రేమించిన అమ్మాయిపైనే వాడి చేత్తో …పాపం చేసాడు. ఇంతకీ ఆ అమ్మాయికి వీడు ఇష్టమా అంటే కానే కాదు..వద్దు వద్దు అని అంటున్నా …రాక్షసుడిలా యాసిడ్ పోసాడు …ఇప్పుడు ఆ అమ్మాయి పాపం ప్రాణాలతో కొట్టుమిట్టాడుకుంటుంది .
ఒకవైపు ఇవాళ ప్రేమికుల రోజు పురస్కరించుకొని ప్రేమికులు ఆనందంగా గడుపుతుంటే, ప్రేమ పేరుతో ఓ దుర్మార్గుడు ఓ యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి తలపై కత్తితో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
Also Read: Cm revanth: మోదీ కులం పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..
ప్యారంపల్లెకి చెందిన గౌతమి అనే యువతిని మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయంకావడంతో, అతడు అత్యంత పాశవికంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, రాష్ట్రంలో అమ్మాయిలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వచ్చిన మహిళలపై కూడా పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటి సంఘటనల్లో, రెండు రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో ఓ సీఐపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.