Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాపై క్రేజీ అప్డేట్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి.తాజాగా ‘స్పిరిట్’ సినిమాని మెక్సికోలో స్టార్ట్ చేస్తున్నట్లు సందీప్ రెడ్డి వంగ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కేవలం యాక్షన్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఉత్కంఠభరిత కథనం ఉంటుందని సందీప్ కన్ఫర్మ్ చేశారు. ఇది అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
Also Read: Peddi First Shot: మళ్ళీ పుడాతామా ఏంటి..పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది.. గ్లింప్స్ అదిరిపోయిందిగా..
Spirit: ఇప్పటివరకూ ఇది సాలిడ్ యాక్షన్ మూవీ అనుకున్నవారికి, ఇప్పుడు థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో కూడిన సినిమా అనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది.సందీప్ రెడ్డి వంగ గత చిత్రాల్లో చూపిన ఇంటెన్సిటీ, ప్రభాస్ యాక్షన్ స్టైల్ కలిస్తే ‘స్పిరిట్’ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. మెక్సికో లొకేషన్స్‌తో పాటు ఈ కొత్త అప్డేట్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!