Harihara Veeramallu

Harihara Veeramallu: హరిహర వీరమల్లు’ నుంచి రొమాంటిక్ ట్రీట్.. నిధి గ్లామర్ పిక్స్!

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా నుంచి నాలుగో పాట విడుదలై, అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

ఈ పాట అద్భుతమైన రొమాంటిక్ ఫీల్‌తో ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత పవన్‌పై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ అభిమానులకు కనువిందు చేసేలా ఉంది. కీరవాణి సమకూర్చిన స్వరాలు, శ్రీహర్ష ఈమని రాసిన సాహిత్యం పాటకు జీవం పోశాయి. లిప్సిక భాష్యం గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: Mirai Teaser: సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ టీజర్.. తేజ సజ్జకు గ్లోబల్ హిట్ పక్కా!

Harihara Veeramallu: విజువల్స్‌లో అద్భుతమైన సెట్టింగ్‌లతో పాటు ఊహించని క్యామియోలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నిధి అగర్వాల్ గ్లామర్, డ్యాన్స్ మూమెంట్స్ పాటకు సొగసు తెచ్చాయి. పవన్‌ కళ్యాణ్ విజువల్స్ తక్కువగా ఉన్నప్పటికీ, కనిపించిన షాట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పాట యువత, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. జూన్ 12న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India Pakistan War: అమృత్‌సర్‌లో పాక్‌ డ్రోన్ల కూల్చివేత.. వీడియో షేర్‌ చేసిన భారత ఆర్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *