Mirai Teaser: తేజ సజ్జ హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరో భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ టీజర్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ఇండియన్ సినిమా సరిహద్దులను దాటి గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకుంటోంది.
తేజ సజ్జ, మంచు మనోజ్‌ల సాహస సన్నివేశాలు అద్భుతంగా ఉండగా, ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాణ విలువలు ఆకర్షిస్తున్నాయి. మంచు మనోజ్ నెగెటివ్ షేడ్‌లో సర్ప్రైజ్ చేస్తే, తేజ సజ్జ మరోసారి భారీ బాధ్యతను మోస్తున్నాడు. టీజర్‌లోని చివరి సన్నివేశంలో రాముని రాకపై చూపించిన విజువల్స్ అద్భుతం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రంతో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. ‘మిరాయ్’ పాన్-ఇండియా స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.
