35-Chinna Katha Kaadu: నివేదా థామస్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ నటించిన ’35 చిన్నకథకాదు’ సినిమా అధికారికంగా ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. ఈ ఏడాది నవంబర్ లో గోవాలో జరగనున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు సినిమా రంగం నుంచి తమ సినిమా ఎంపిక కావటం పట్ల ’35 చిన్నకథకాదు’ యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. నందకిషోర్ ఈమని దర్శకత్వంలో సృజన్ ఎర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లితో కలసి నటుడు రానా ఈ మూవీని నిర్మించటం విశేషం. తిరుపతి నేపథ్యంలో చిన్న పిల్లల చదువు ముఖ్యాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. తన కొడుకు కోసం విద్య నేర్చుకుని చదివించి మరీ పాస్ చేయించిన గృహిణి కథతో రూపొందించిన ’35 చిన్న కథకాదు’ను ప్రేక్షకులు సైతం ఆదరించారు. మరి ఇప్పుడు ఈ సినిమాకు అవార్డులు కూడా వస్తాయేమో చూడాలి.