Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలో ఘటన

Tamil Nadu: ప్రస్తుత రోజుల్లో జనాలు అడవులు నరికి పెద్ద పెద్ద భవనాలు, కంపెనీలు వంటిని నిర్మిస్తున్నారు. దీంతో అడవుల్లో జీవించే జంతవులకు నిలువనీడ లేకుండా పోతుంది. ఇలాంటి సందర్బాల్లో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూరింది. పులిని చూసి భయాందోళనకు గురైన పోలీసులు దెబ్బకు స్టేషన్‌ను వదిలి బయటకు వెళ్లారు.

తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించడం స్థానికంగా కలకలం రేపుపింది. నడుగూడలూరు-ఊటీ జాతీయ రహదారి పక్కన ఉన్న నడువట్టం పోలీస్ స్టేషన్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. మెళ్లగా పీఎస్‌ లోపలికి వచ్చి ఇన్స్పెక్టర్ కూర్చున్న గది చుట్టూ తిరిగింది. ఆ గదిలో తినడానికి ఏమైనా ఉన్నాయా అని చూసింది.

Also Read: Crime News: ప్రాణం తీసిన లిక్కర్ పందెం..

అదే సమయంలో, మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి గదిలో చిరుతపులి తిరగడం చూసి షాక్ అయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. ఇక గది మోత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో, చిరుతపులి తిరిగి మెట్లు దిగి, వచ్చిన దారిలోనే బయటకు వెళ్లిపోయింది. దీంతో పులి ఉందా వెళ్లి పోయిందానని తలుపు గుండా తొంగి చూశాడు. పులి వెళ్లిపోవడంతో అమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే పీఎస్‌ తలుపులు మూసేసి తాళం వేశాడు.

ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు బయట ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *