Dragon: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ గెటప్ పూర్తిగా కొత్తగా ఉంటుందని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం అదిరిపోయే భారీ సెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: Balakrishna: బాలయ్యతో తమన్నా స్పెషల్ సాంగ్?
ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్‌తో పాటు దాదాపు వంద మంది జూనియర్ ఆర్టిస్టులు కనిపించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ గెటప్ పూర్తిగా కొత్తగా, అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ కృషి చేస్తున్నాడు. అందుకే స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా సమయం తీసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.

