Clashes At Football Match

Clashes At Football Match: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రక్తపాతం.. 100 మంది మృతి!

Clashes At Football Match: గినియా లోని రెండో అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యర్థి అభిమానుల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో దాదాపు 100 మందికిపైగా మరణించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు గొడవకు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని, తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గినియా జుంటా నాయకుడు మామాడి డౌంబౌయా గౌరవార్థం ఈ మ్యాచ్ నిర్వహించారు.

అయితే మృతుల సంఖ్య గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నగరంలోని శవాగారాలన్నీ శవాలతో నిండిపోయాయని అక్కడి మీడియా తెలిపింది. ఆసుపత్రుల బాల్కనీలు కూడా మృతదేహాలతో నిండిపోయినట్లు సమాచారం. అధ్యక్షుడు మామడి డౌంబౌయాను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన మ్యాచ్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. రిఫరీ నిర్ణయం హింసకు దారితీసిందని అంటున్నారు. దీంతో ఇరు జట్ల అభిమానులు మైదానంలోకి చొరబడటంతో ఘర్షణ మొదలై, ఆ తర్వాత హింస వీధులకు కూడా వ్యాపించింది.

Clashes At Football Match: అదే సమయంలో ఎసెరెకోర్‌లోని పోలీస్ స్టేషన్‌కు కూడా పలువురు దుండగులు నిప్పు పెట్టారు. 2021లో ఆల్ఫా కాంటే పాలనను పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న నాయకుడు డౌంబౌయా కూడా సైనికుడే. ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఫుట్ బాల్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి అయిన తర్వాత గత జనవరిలో లెఫ్టినెంట్ జనరల్‌గా, గత నెలలో ఆర్మీ జనరల్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత తిరుగుబాటుదారులు తీవ్రంగా అణచివేయబడ్డారు. ఇంతలోనే ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *