Ranga Reddy: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్లలో దారుణం చోటు చేసుకుంది. బావ, బామ్మర్ది ఘర్షణ పడి ఇద్దరు హత్యకు గురయ్యారు. నాగిళ్ల గ్రామానికి చెందిన బర్కం యాదయ్య పదేళ్ల క్రితం భార్యను హతమార్చిన కేసులో జైలుకు వెళ్లి ఏడాది క్రితమే బయటకు వచ్చాడు. గ్రామంలో జరిగిన ఓ వివాహానికి తన భార్య సోదరుడు యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీను హాజరయ్యాడు. ఈ క్రమంలో బావను పరామర్శించడానికి వెళ్లిన శ్రీనుపై యాదయ్య గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనాస్థలికి చేరు కోగా యాదయ్య సైతం మృతి చెంది ఉన్నాడు. పాత కక్షలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. జంట హత్యలతో నాగిళ్ల గ్రామం ఒక్కసారి ఉల్కిపడింది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రేపు వరంగల్ లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటన
గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య
Telangana: గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని తనువు చాలించింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగింది. ఆ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్వాతి శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వెంటనే సిబ్బంది చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయి ఉన్నదని ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్న

