Mahabubnagar:

Mahabubnagar: విద్యార్థినిపై మ‌హిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక‌దాడి.. నిందితురాలు స‌హా ప్రిన్సిపాల్ స‌స్పెన్ష‌న్‌

Mahabubnagar: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై లైంగిక‌దాడి ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు తీవ్ర చ‌ర్య‌లు తీసుకున్నారు. లైంగిక‌దాడికి పాల్ప‌డిన వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు ప్రిన్సిపాల్‌పైనా చ‌ర్య‌లు తీసుకున్నారు. విద్యార్థిని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు ఆ ఇద్ద‌రినీ స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధ్యురాలైన వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

Mahabubnagar: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జడ్చ‌ర్ల మండ‌ల కేంద్రంలోని ఒక గురుకుల పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువున్న విద్యార్థిని (15)పై ఆ పాఠ‌శాల మ‌హిళా వైస్ ప్రిన్సిపాల్ రాజ్య‌ల‌క్ష్మి లైంగిక‌దాడికి పాల్ప‌డింది. ఏడాది కాలంగా ఆ బాలిక‌ను ఆమె లైంగికంగా వేధింపుల‌కు గురి చేసింద‌ని తేలింది. నేరాల‌పై ఇటీవ‌ల అదే పాఠ‌శాల‌లో జిల్లా ఎస్పీ జాన‌కి ఓ అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె చెప్పిన ధైర్యంతో ఆ విద్యార్థిని త‌న‌కు జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌పై ఫిర్యాదు చేసింది.

Mahabubnagar: దీంతో ఎస్పీ పోలీసుల‌తో విచార‌ణ చేప‌ట్ట‌గా, అస‌లు బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఏడాదిగా ఆ బాలిక‌ను వేధించ‌డంపై ఆధారాల‌ను సేక‌రించారు. బాధితురాలు త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు వైస్ ప్రిన్సిపాల్ రాజ్య‌ల‌క్ష్మిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు వైస్ ప్రిన్సిపాల్‌తోపాటు ప్రిన్సిపాల్ రాగ‌మాల‌ను కూడా స‌స్పెండ్ చేస్తూ ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *