Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు.. బాలీవుడ్‌పై భారీగా దృష్టి సారించి ఏకంగా ఆరు సినిమాలను నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలపై దిల్ రాజు స్పందించారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇదే.. సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన ప్రచారంపై స్పందించిన దిల్ రాజు.. ఒక అధికారిక నోట్‌ను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Producer Saravanan: రజినీకాంత్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత మృతి
దిల్ రాజు విడుదల చేసిన నోట్‌లో కీలక అంశాలు:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థ నుంచి రాబోయే సినిమాల గురించి ఇటీవల రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని స్పష్టం చేస్తున్నాం. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలను, ప్రస్తుత విషయాలతో ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి మేము బాలీవుడ్‌లో కేవలం ఒకే ఒక్క సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమా లో అక్షయ్ కుమార్ నటిస్తుండగా ఆ సినిమాకి అనీస్ బాజ్మీ దర్శకత్వం చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, అధికారిక ప్రకటనను త్వరలోనే తెలియజేస్తాం. అప్పటివరకూ దయచేసి ఎవరూ అసత్యాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు ఆ నోట్‌లో విజ్ఞప్తి చేశారు.

