Varanasi

Varanasi: వారణాసిలో షాకింగ్ సన్నివేశాలు?

Varanasi: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజా బజ్ ఏమిటో? దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Rahul Sipligunj Sangeet: సంగీత్ లో భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్..

గ్లోబల్ లెవెల్‌లో ఆసక్తి రేకెత్తించిన ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోడీగా నటిస్తున్న ఈ సినిమా 2027 వేసవిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు చిన్ననాటి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లను రాజమౌళి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఇస్తాయని యూనిట్ సోర్సెస్ చెబుతున్నాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మరింత గ్రాండ్ ట్రీట్‌గా తయారవుతోందని టాక్. ఇప్పటికే కాన్సెప్ట్ ట్రైలర్‌తోనే ప్రపంచవ్యాప్తంగా హైప్ సృష్టించిన ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *