Kaantha: దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంతా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ షాక్ ఇచ్చింది. ప్రీమియర్ షోలు, రానా-దుల్కర్ కాన్ఫిడెన్స్ చూసి అందరూ 100 కోట్ల క్లబ్ లో ఈ సినిమా జాయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం 40 కోట్ల లోపే ముగిసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Shraddha Kapoor: ఈఠా సెట్స్ గాయంపై శ్రద్ధాకపూర్ అప్డేట్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘కాంతా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని దెబ్బ తగిలింది. చెన్నైలో జరిగిన ప్రీమియర్ షోలకు వచ్చిన రివ్యూలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దుల్కర్, రానా ఇద్దరూ కంటెంట్ పై అపార నమ్మకం చూపించారు. దాంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ సాధిస్తుందని, సులువుగా 100 కోట్లు దాటుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలైన తర్వాత మౌత్ టాక్ పాజిటివ్‌గా రాకపోవడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పటివరకు మొత్తం రూ.40 కోట్ల లోపే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దుల్కర్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగారు.

