iBomma Ravi:ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇమ్మడి రవి (iBomma Ravi) తెలియని వారుండరు. సినిమాల పైరసీ నేరాలపై ఆయన కోర్టు రిమాండ్‌లో ఉన్నాడు. అయితే పట్టుకోండి చూద్దాం.. అని గతంలో చాలెంజ్ విసిరి విదేశాల్లోనే ఉంటూ వస్తున్న ఐ బొమ్మ రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారా? అని అందరిలోనూ సంశయం ఉన్నది. అయితే భార్య పట్టించిందనే ప్రచారాన్ని ఇప్పటివరకూ నమ్మిన ప్రజలకు మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది.
iBomma Ravi:ఎప్పటి నుంచో ఐ బొమ్మ రవి (iBomma Ravi) కోసం సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచారు. ఇటీవల ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట ఒక డొమైన్‌న్లు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌ను సంపాదించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఆ ఫోన్ నంబర్ నుంచి చాటింగ్, ఇతర కాల్స్‌పైనా ఓ కన్నేసి ఉంచారు.
iBomma Ravi:విదేశాల్లో ఉంటూ అప్పడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చి ఒక స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకుంటాడని పోలీసులు గుర్తించారు. రవి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తమకు చెప్పాలని అతని స్నేహితుడికి సైబర్ క్రైమ్ పోలీసులు ఆదేశించారు. దానికి అంగీకరించిన ఆ స్నేహితుడు. కానీ, ఈ విషయాన్ని రవికి చెప్పకుండా దాచి ఉంచాడు.
iBomma Ravi:ఇటీవలే ఫ్రాన్స్ వెళ్లిన ఇమ్మడి రవి (iBomma Ravi) నేరుగా హైదరాబాద్ రానే వచ్చాడు. ఎప్పటిలాగే తన స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకోవచ్చు అని ఆయన భావించాడు. ఎప్పటిలాగే తన స్నేహితుడికి ఓ మెసేజ్ పెట్టాడు. “మామా హైదరాబాద్ వచ్చా.. కలుద్దాం” అంటూ ఆ స్నేహితుడికి రవి మెసేజ్ పెట్టాడు. రవి స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో ఐ బొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేసినట్టు విశ్వసన సమాచారం బయటకు వచ్చింది.
iBomma Ravi:వాస్తవంగా గతంలో ఐబొమ్మ రవి అరెస్టు అయిన సమయంలో మరో విషయం ప్రచారంలో ఉన్నది. ఇక్కడ ఉన్న ఓ ఆస్తిని అమ్ముకునే విషయంలో, రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ వచ్చాడని, ఈ విషయాన్ని ఆయన భార్య స్వయంగా పోలీసులకు సమాచారం చేరవేసిందని, ఆ సమాచారంతోనే పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఏదైతేనేమి కానీ, హైదరాబాద్ వచ్చి రవి పట్టుబడ్డాడని, ఇక్కడికొచ్చాకే పోలీసులు పట్టుకోగలిగారని తెలుస్తున్నది.

