MLA Bandla: తాము ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రిని కలవకపోతే నియోజకవర్గ అభివృద్ధి దెబ్బతింటుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సహకారం లేకుండా ప్రాంత అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మార్పు పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో స్పీకర్ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ, తాను రెండు సార్లు విచారణకు హాజరై వివరాలన్నీ ఇచ్చినట్లు తెలిపారు.
“ప్రజల కోసమే సీఎంను కలుస్తున్నాను”
ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, పూర్తిగా ప్రజల పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలుస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే సీఎం సహకారం అవసరం అవుతుందని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజల నిర్ణయం పార్టీకి అతీతం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పార్టీలను కాదు, అభివృద్ధిని చూసేలా ఓటింగ్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
“స్పీకర్ విచక్షణపైనే నా భవిష్యత్తు”
పార్టీ ఫిరాయింపు కేసు పూర్తిగా స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని ఆశ వ్యక్తం చేశారు.
“అభివృద్ధి చేపట్టే పార్టీకే నా భవిష్యత్తు”
అభివృద్ధి అజెండాతో ముందుకు సాగే పార్టీకే తాను కట్టుబడి ఉంటానని,జూబ్లీహిల్స్ ప్రజలు చూసిన అభివృద్ధినే గద్వాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

