Shobana: సీనియర్ నటి శోభనా రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఆమె గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ చిత్రానికి మరింత ఎమోషనల్ డెప్త్ జోడిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు దేశావ్యాప్తంగా హైప్ క్రియేట్ చేస్తోంది.
తెలుగు సినీ అభిమానులకు శుభవార్త. సీనియర్ నటి శోభనా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎమోషనల్ డెప్త్‌ను పెంచుతాయని అంచనా. ‘పెద్ది’ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా తెలుస్తోంది. శోభనా పాత్ర చిత్రంలో మలుపు తిరుగుతుందని సమాచారం. ఆమె ఇప్పటికే పలు భాషల్లో గొప్ప పాత్రలు పోషించారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో ఆమె కాంబినేషన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. చిత్ర బృందం శోభనా పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ ఆమె ఎంట్రీతో చిత్రం మరింత బలోపేతమవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ‘పెద్ది’ని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, ఇటీవల రిలీజ్ చేసిన చికిరి సాంగ్ గ్లోబల్ చార్ట్ బస్టర్ అయింది. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

