Visakhapatnam

Visakhapatnam: కంటైనర్ లారీ బోల్తా.. విశాఖ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Visakhapatnam: విశాఖపట్నం నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షీలానగర్ కూడలి వద్ద జాతీయ రహదారిపై ఒక కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పోర్టు రోడ్డు వైపు నుంచి ఎన్ఏడీ కూడలి వైపు వెళ్తున్న ఈ లారీ, షీలానగర్ జంక్షన్ వద్దకు రాగానే అదుపు తప్పింది. అదృష్టవశాత్తూ లారీ బోల్తా పడిన సమయంలో ఆ ప్రాంతంలో ఇతర వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో, పెను ప్రమాదం తప్పింది.

అయితే, లారీ రహదారి మధ్యలో అడ్డంగా పడిపోవడంతో షీలానగర్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయం వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆ దారిలో వెళ్లాల్సిన వందలాది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూనే, నాలుగు భారీ క్రేన్‌ల సహాయంతో బోల్తా పడిన కంటైనర్‌ను రహదారిపై నుంచి తొలగించే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితేనే రహదారిపై ట్రాఫిక్ తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *