Telangana: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ప్రభుత్వాలు సాయం ఇస్తామన్నాయి. పోస్టు మార్టం రిపోర్టులు నమోదు చేసి మృతదేహాలను వారిండ్లకు అప్పగించారు. దుఃఖసాగరంలో మునిగిన వారి కుటుంబాలు, బంధుమిత్రులు దహన సంస్కారాలు చేశారు. కానీ, ఇదే రోడ్డుపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం మీకు తెలుసా? ఇదే విషయం ఇప్పుడు బయటకొచ్చింది.
Telangana: హైదరాబాద్-బీజాపూర్ (ఎన్హెచ్ 165) జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ సేకరణను పూర్తి చేసింది. కానీ, ఆ రోడ్డుపై దశాబ్దాల నుంచి ఉన్న వటవృక్షాలను తొలగించకుండా కొందరు ఎన్టీటీని, న్యాయస్థానాలను ఆశ్రయించారు. వాటిని రీప్లాంటేషన్ చేస్తామని పాలకులు హామీ ఇచ్చినా అంగీకారం దొరకలేదు. దీంతో ఆ రోడ్డు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది.
Telangana: హైదరాబాద్-బీజాపూర్ (ఎన్హెచ్ 165) జాతీయ రహదారిని రాకాసి రహదారి అని ఆ ప్రాంత ప్రజలు పిలుస్తారు. ఈ రహదారిలో సుమారు 46 కిలోమీటర్ల వరకు భూ సేకరణ సమస్యో, మరేదో కానీ, వంకర టింకర్లుగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడే గుంతలు ఉన్నాయి. ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని, ఆ ప్రాంత ప్రజలు జంకుతుంటారు. ఇదే రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు సతమతం అవుతూ ఉంటారు.
Telangana: హైదరాబాద్-బీజాపూర్ (ఎన్హెచ్ 165) జాతీయ రహదారిపై 2018 నుంచి ఇప్పటి వరకూ జరిగిన వివిధ ప్రమాదాల్లో సుమారు 200 మంది మృతి చెందారు. మరో 600 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలిసింది. తాజాగా రోడ్డుకు అడ్డంకులు తొలిగిపోయాయని భావించే సమయంలో ఆర్టీసీను టిప్పర్ ఢీకొని 19 మంది ప్రాణాలను బలిగొన్నది. దీంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఇప్పటికైనా పాలకులు అసంపూర్తి రోడ్లను సకాలంలో పూర్తిచేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

