Viral News

Viral News: వివాహ బంధంతో ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్‌ అమ్మాయి

Viral News: ప్రేమకు, పెళ్ళికి సరిహద్దులు లేవని నిరూపిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చైతన్య, ఇమామ్‌ బెన్‌(ఫ్రాన్స్‌ ) చెందిన శాన్వి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఉద్యోగ నిమిత్తం కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటున్న చైతన్యకు అక్కడే శాన్వితో పరిచయం ఏర్పడింది. పరిచేయం కాస్త కొంత కలం తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఈ జంట, చివరకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.

ఇది కూడా చదవండి: Kabaddi Player: కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య..పాత కక్షలే కారణం..?

వీరి వివాహం సిరిసిల్లలోని ఓ కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. వివాహ వేడుకలో పాల్గొన్న వధువు బంధువులు కూడా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి, ఈ నూతన జంటను ఆశీర్వదించారు.తెలంగాణ సంస్కృతి మరియు ఫ్రాన్స్‌ సంస్కృతుల కలయికతో జరిగిన ఈ వివాహం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *