Kathari Couple 2015లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జంట హత్య కేసు వెనుక కుటుంబ, ఆర్థిక, మరియు రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయని విచారణలో తేలింది. సుదీర్ఘకాలం పాటు జరిగిన విచారణ తర్వాత కోర్టు ఈ కఠినమైన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నేరం రుజువైన ఐదుగురు నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ కోర్ట్ తీర్పునిచ్చింది.
సంఘటన వివరాలు
2015 నవంబర్ 17 ఆ రోజు చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ & ఆమె భర్త కటారి మోహన్ (మున్సిపల్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు) లను చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో ముసుగు ధరించిన దుండగులు తుపాకులు, కత్తులతో ఛాంబర్లోకి దూసుకువచ్చి దాడి చేశారు. మేయర్ అనూరాధపై తుపాకీతో కాల్పులు జరపగా, మోహన్‌ను కత్తులతో నరికి చంపారు.పోలీసులు మొదట 23 మందిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కుట్రకు ప్రధాన కారణం
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1), హత్యా నకు గురైన మోహన్ మేనల్లుడు కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Couple Murder Verdict: మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరి శిక్ష
రాజకీయంగా తనకు గుర్తింపు ఇవ్వడం లేదని, ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయని చింటూ తన మేనమామ, మేనత్త దంపతులపై పగ పెంచుకున్నాడని దర్యాప్తులో తేలింది. చింటూ మరికొందరితో కలిసి ఈ దారుణమైన హ*త్యకు కుట్ర పన్నాడు.
న్యాయస్థానం తీర్పు
సుమారు పదేళ్లు పాటు జరిగిన ఈ విచారణలో, కోర్టు 122 మందికి పైగా సాక్షులను విచారించింది. చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం పరిధిలోని మహిళా ప్రత్యేక కోర్టు ఐదుగురు నిందితులపై నేరం రుజువైనట్లు నిర్ధారించింది.
ఉరిశిక్ష పడిన ఐదుగురు:
- 
- చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1)
- ఎం. వెంకటాచలపతి (A2)
- జయప్రకాష్ రెడ్డి (A3)
- మంజునాథ్ (A4)
- వెంకటేష్ (A5)
 
- మిగిలిన నిందితులు: A6 నుంచి A23 వరకు ఉన్న ఇతర నిందితులపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేసింది. (ఒక నిందితుడు విచారణ సమయంలో మరణించగా, మరొకరు కేసు నుంచి విడుదలయ్యారు.)
ఈ కఠిన తీర్పును బాధితుల కుటుంబం, ముఖ్యంగా కటారి మోహన్ కోడలు కటారి హేమలత (CHUDA చైర్పర్సన్) స్వాగతించారు.


