Maoists

Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది లొంగుబాటు!

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద షాక్ తగిలింది. ఉగ్రవాద కార్యకలాపాలు మానుకుని, శాంతి మార్గాన్ని ఎంచుకుంటూ ఏకంగా 51 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళా నక్సల్స్ కూడా ఉండటం విశేషం. వీరంతా తమ పోరాటాన్ని విడిచిపెట్టి, సాధారణ ప్రజల్లా బతకడానికి ఇష్టపడ్డారు.

పోలీసుల విజ్ఞప్తి:
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. “తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న మిగిలిన మావోయిస్టులు కూడా తప్పు తెలుసుకుని, ప్రభుత్వ సాయంతో జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రశాంతమైన జీవితం గడపాలని” వారు గట్టిగా కోరారు.

ప్రభుత్వం అందించే లొంగుబాటు పథకాలను ఉపయోగించుకుని, మారాలనుకునే వారికి తాము పూర్తి సహకారం అందిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ లొంగుబాటు సంఘటన మావోయిస్టుల ఉద్యమానికి తీవ్రమైన దెబ్బగా భావించవచ్చు. ఇది ఆ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఒక మంచి పరిణామం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *