ISRO:

ISRO: మ‌రో భారీ ప్ర‌యోగానికి ఇస్రో సిద్ధం

ISRO: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. న‌వంబ‌ర్ 2న ఎల్‌వీఎం3-ఎం5 బాహుబ‌లి రాకెట్ ద్వారా సీఎంఎస్ 03 ఉప‌గ్ర‌హం ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. 4,400 కిలోల బ‌రువు ఉన్న జీసాట్‌-7ఆర్ ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నున్న‌రు. తిరుప‌తి జిల్లా స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ షార్‌లోని రెండో లాంచ్ ప్యాండ్ నుంచి దీనిని ప్ర‌యోగించ‌నున్న‌ది.

ISRO: శ్రీహ‌రికోటలోని వెహికిల్ అసెంబ్లింగ్ భ‌వ‌నంలో రాకెట్ అనుసంధాన ప‌నుల‌ను పూర్తిచేశారు. వాహ‌న నౌక‌ను లాంచ్ ప్యాడ్‌కు విజ‌య‌వంతంగా త‌ర‌లించారు. జీసాట్‌-7ఆర్ ఉప‌గ్ర‌హం 36,000 కిలోమీట‌ర్ల ఎత్తులోని జీటీవో ఆర్బిట్‌లోకి పంపేందుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికే స‌న్నాహాల‌ను పూర్తిచేశారు.

ISRO: ఇది ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైతే మారుమూల ప్రాంతాల‌తో స‌హా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించ‌డానికి వీలు క‌లుగుతుంది. దీంతో మ‌రో మైలురాయిని అందుకోనున్నట్టు శాస్త్ర‌వేత్త‌లు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. ఇస్రో ప్ర‌యోగాల ప‌రంప‌ర‌లో సరికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానంతో నానాటికీ ముంద‌డుగు వేస్తూ దూసుకెళ్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *