Viral News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత కోడి పుంజు విషయం వెలుగులోకి వచ్చింది. అశ్వారావు పేట మండలం నారంవారిగూడెం సమీపంలో ప్రసాద్ అనే వ్యక్తి పెంచుకున్న కోళ్లలో ఈ కోడి పుంజు ఒకటి. దానికి నాలుగు కాళ్లు ఉండటం విశేషం. వింత ఆకృతిని పోలి ఉన్న ఆ కోడి పుంజును చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
Viral News: ఇంత వింతా, జన్యు సంబంధమో కానీ, ప్రసాద్ ఇంటిలో ఉన్న ఆ వింత కోడి పుంజును సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వారు తిలకించి వెళ్తున్నారు. మరికొందరు ఓ ముందడుగు వేసి ఇది బ్రహ్మంగారి జోస్యం నిజమైందంటూ తేల్చి చెప్తున్నారు.
Viral News: ఆ కోడి పుంజు సుమారు 2 కిలోలకు పైగానే ఉంటుంది. దానికి నాలుగు కాళ్లు ఉన్నప్పటికీ రెండు కాళ్లతోనే అది నడుస్తున్నది. మరో రెండు కాళ్లు పైకి లేచి ఉంటాయి. ప్రసాద్ ఇంటి వద్ద వచ్చిన వారికి కోడిపుంజును చూపుతున్న వీడియో వైరల్గా మారింది. పందెంకోడి కావడం విశేషం. వచ్చే సంక్రాంతి నేపథ్యంలో పందెంరాయుళ్లు ఈ పుంజును చూసి, దాని సామర్థ్యంపై చర్చించుకోవడం విశేషం.

