Piyush Goshal: కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల బెదిరింపులకు కఠినంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, భారత్ ఎవరికీ తలొగ్గదని, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ దేశాల సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందని చెప్పారు. 2021లో కరోనా మహమ్మారి ప్రభావం తరువాత దేశం వాణిజ్య విధానంలో కీలక మార్పులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్ ఒంటరిగా కాకుండా ఇతర దేశాలతో విశ్వసనీయ సంబంధాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉందని గోయల్ తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆయన వివరిచారు.
అయితే, భారత్ ఎలాంటి ఒత్తిడి లేదా బెదిరింపులకూ లోబడదని గోయల్ హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న సుంకాలను భారత్ అంగీకరిస్తున్నప్పటికీ, అమెరికా మరిన్ని సుంకాలు విధిస్తే ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు భారత్ వాణిజ్య స్వావలంబన మరియు వ్యూహాత్మక ఆర్థిక దిశపై కేంద్ర ప్రభుత్వ దృక్పథాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

