Kurnool: అమెజాన్ సంస్థపై నాన్ బైలబుల్ వారెంట్

Kurnool: కర్నూలు జిల్లాలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌పై కన్స్యూమర్‌ ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. వినియోగదారుడి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, ఫోరం సంస్థపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే — కర్నూలు జిల్లా నివాసి ఓ వినియోగదారు రూ.80,000 చెల్లించి అమెజాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఐఫోన్‌ 15 ప్లస్‌ ఆర్డర్‌ చేశారు. అయితే, నిర్దేశిత ఉత్పత్తి స్థానంలో సంస్థ IQOO బ్రాండ్‌ ఫోన్‌ను పంపించింది. ఈ విషయం గమనించిన బాధితుడు వెంటనే అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించినప్పటికీ, ఎటువంటి స్పందన రాలేదట.

తనకు న్యాయం దక్కాలని భావించిన వినియోగదారు కర్నూలు జిల్లా కన్స్యూమర్‌ ఫోరంను ఆశ్రయించారు. ఫోరంలో విచారణ అనంతరం, అమెజాన్‌ సంస్థ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన న్యాయమూర్తి, సంస్థపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ఫోరం తీర్పు ప్రకారం —

బాధితుడికి ఐఫోన్‌ 15 ప్లస్‌ డెలివరీ చేయాలని,అది సాధ్యం కాకపోతే రూ.80,000 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని,అదనంగా మానసిక వేదనకు పరిహారంగా రూ.25,000 చెల్లించాలని ఆదేశించింది.

అయినా సంస్థ ప్రతినిధులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో, కన్స్యూమర్‌ ఫోరం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ ఘటనతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో వినియోగదారుల హక్కులు ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.

ప్రజలు కూడా ఇలాంటి మోసపూరిత చర్యలు ఎదురైనప్పుడు కన్స్యూమర్‌ ఫోరంను సంప్రదించవచ్చని, న్యాయం దక్కించుకోవడానికి చట్టం తమ పక్షంలో ఉందని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *