Ram-Bhagyashri

Ram-Bhagyashri: రామ్-భాగ్యశ్రీ లవ్ స్టోరీ.. కన్ఫర్మ్?

Ram-Bhagyashri: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్-స్క్రీన్ లవ్ టాక్ వైరల్ అవుతోంది. దీనిపై రామ్ రియాక్షన్ ఆసక్తి రేపుతోంది.

Also Read: Rakhi Sawant: మిల్కీ బ్యూటీపై రాఖీ సావంత్ ఫైర్!

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మహేష్ పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ జంట పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో రామ్, భాగ్యశ్రీ మధ్య ఆఫ్-స్క్రీన్ రొమాన్స్ జోరుగా సాగుతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్.. జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో జగపతిబాబు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. తెలంగాణ క్వీన్ ఎవరని, ఏమైనా అఫైర్ ఉందా అని జగ్గుభాయ్ అడిగిన ప్రశ్నలకు రామ్ నవ్వుతూ ఊరుకున్నాడు. తన రిలేషన్షిప్ విషయంలో గోప్యత పాటిస్తానని చెప్పాడు. ఈ సమాధానంతో రామ్-భాగ్యశ్రీ లవ్ స్టోరీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్, నెటిజన్స్ అంటున్నారు. ఈ స్వీట్ జంట ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ రెండు చోట్లా అదరగొడతారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్‌తో ఈ జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *