Womens World Cup 2025: మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఆతిథ్య భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు టోర్నమెంట్లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హెదర్ నైట్ అద్భుతమైన సెంచరీ (109)తో చెలరేగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు తీసి సత్తా చాటింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, ఒక దశలో విజయం దిశగా సాగింది.
ఇది కూడా చదవండి: Viral News: ఫుల్ గా తాగి యువతీ.. నన్ను రే*ప్ చేయండంటూ హల్ చల్.. చివరికి
ఓపెనర్ స్మృతి మంధాన (88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), మరియు చివరిలో దీప్తి శర్మ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. అయితే, ముఖ్యమైన సమయంలో కీలక వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. చివరి ఓవర్లలో తడబడిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో భారత్ సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి. నాకౌట్‌కు చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నాయి.