Kavita: టీచర్ల సమస్యలపై పోరాటం తప్పదని కవిత స్పష్టం

Kavita: టీచర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. టీచర్ల గురించి గొప్పగా మాట్లాడే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వారికి జీతాలు కూడా సమయానికి ఇవ్వలేకపోతుందనే విమర్శలు ఆమె గుప్పించారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (TJTF) లోగోను కవిత జాగృతి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీచర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన 12 ఏళ్ల క్రితం నుంచే ఉందని, ఇప్పుడు ఆ సంకల్పం నెరవేరిందని చెప్పారు.

“తెలంగాణ జాగృతి ఎప్పటిలాగే అందరితో కలిసి పనిచేసింది. అదే విధంగా పాత సంఘాలను కలుపుకుని TJTF కూడా టీచర్ల కోసం కట్టుబడి పనిచేస్తుంది” అని కవిత తెలిపారు.

తన ప్రియమైన ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొంటూ — తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ఆయన విద్యార్థుల మాదిరిగా అందరికీ అర్థమయ్యేలా వివరించారని కవిత గుర్తుచేశారు.

తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలకపాత్ర పోషించారని, ఆనాటి ప్రభుత్వం నిర్భంధం ఉన్నప్పటికీ వారు తెలంగాణ మ్యాప్‌లు, ప్రత్యేక క్విజ్ పోటీల ద్వారా భావజాలాన్ని వ్యాప్తి చేశారని అన్నారు.

“ఇలాంటి టీచర్ల సమస్యలపై మనందరం పోరాటం చేయడం మన బాధ్యత. TJTF ద్వారా టీచర్ల హక్కుల కోసం గళమెత్తుతాం” అని కవిత స్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *